HEALTH INFORMATION

                                               కొలెస్టరాల్ .. కొన్ని నిజాలు..!

        మన శరీరానికి అవసరమైన ముఖ్య పదార్థాల్లో కొవ్వు ఒకటి. దీన్ని వైద్యభాషలో కొలెస్టరాల్‌ గా పిలుస్తారు. మన శరీరానికి, శరీర పెరుగుదలకు ఇది ఎంతో అవసరం. అయితే, అవసరానికి మించితే ఇది పెనుముప్పుగా మారుతుంది. గుండెపోటుతో సహా మరెన్నో అనారోగ్యసమస్యలకు కారణమవుతుంది. బ్యాడ్‌ కొలెస్టరాల్‌, గుడ్‌ కొలెస్టరాల్‌గా విభజిస్తారు. వీటి పని ఏంటి, మనకు ఎంతవరకు వీటి అవసరం ఉంది, కొలెస్టరాల్‌ గుడ్‌, బ్యాడ్‌గా ఎందుకు మారుతుంది అన్న విషయాలను తెలుసుకుంటే కొవ్వు కారణంగా వచ్చే సమస్యలను నివారించవచ్చు.

    - మనం తీసుకున్న ఆహార పదార్థాల జీర్ణానికి అవసరమైన రసాలను పేగుల్లో ఉత్పత్తి చేసేందుకు కొవ్వు కావాలి. శరీరంలో విటమిన్‌ డి, హార్మోన్లు తయారు చేసేందుకు ఇది అవసరం.
కొవ్వు రక్తంలో కలిసిపోదు. లిపో ప్రోటీన్లు శరీరంలోని అన్ని కణాలకు చేరుస్తాయి. సూర్యరశ్మి మన చర్మంపై పడినప్పుడు, చర్మంలో ఉండే కొలెస్టరాల్‌ ఆ కిరణాలను విటమిన్‌ డిగా మారుస్తుంది. అందుకే కొలెస్టరాల్‌ అవసరం ఎంతో ఉంది. 
మనకు ఎంత కావాలో అంత మేర కొవ్వును మన శరీరమే సహజసిద్ధంగా తయారు చేస్తుంది. అయితే, మనం తీసుకునే ఆహారం ద్వారా అదనంగా కొవ్వు వచ్చి చేరుతుంది.
పరిమితి దాటితేనే... 
    మన శరీరంలోని ప్రతీ కణంలోనూ కొలెస్టరాల్‌ ఉంటుంది. శరీరంలో కొలెస్టరాల్‌ ఎక్కువైతే గుండె నుంచి రక్తం తీసుకెళ్లే ధమనుల్లో అది పేరుకుపోతుంది. కొవ్వు వల్ల ధమనులు కుచించుకుపోయి రక్తం సాఫీగా సరఫరా జరగదు. దీంతో రక్తం గడ్డలు కట్టడం కారణంగా గుండెపోటుకు దారితీయడం జరుగుతుంది.
    - కొలెస్టరాల్‌ ను ఎల్‌ డీఎల్‌, హెచ్‌ డీఎల్‌ అని రెండు రకాలుగా చెబుతారు. ఎల్‌ డీఎల్‌ అంటే, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్‌. దీన్నే చెడ్డ కొవ్వుగా అభివర్ణిస్తారు. ఇది పరిమితి దాటితే ముప్పు. అందుకే దీన్ని బ్యాడ్‌ కొలెస్టరాల్‌ గా పిలుస్తుంటారు. ఎల్‌ డీఎల్‌ ఎక్కువైతే గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
- హైడెన్సిటీ లిపోప్రొటీన్స్‌ (హెచ్‌ డీఎల్‌)ను మంచి కొ

Comments